ఈ నెల18 నుంచి ఘనంగా అద్దంకి నాంచారమ్మ జాతరోత్సవాలు..

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం విశ్వనాధపల్లి గ్రామంలో కృష్ణా నది తీరాన కొలువైయున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 18 నుంచి మార్చి 03 వతేది వరకు 15రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓయు. జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం రామనీడు ఉత్సవం,అనతరం చిన్న అమ్మవారిని ఆలయం నుంచి బయటకు తీసి గ్రామోత్సవం ప్రారంభిస్తునామన్నారు. గ్రామోత్సవంలో అమ్మవారు వి.కొత్తపాలెం, గాబ, కుమ్మరిపాలెం, విశ్వనాధపల్లి గ్రామాలలో ప్రతిఇంటికి వెళ్ళి ప్రత్యేక పూజలు అందుకోనున్నట్లు తెలిపారు. మార్చి 2, 3 తేదీలలో ఆలయ ప్రధాన జాతర నిర్వహిస్తున్నట్లు వివరించారు. 4న చిన్న అమ్మవారు ఆలయ ప్రవేశంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Leave a Reply