ఆ సినిమా పేరు… వారణాశి!

- వీడియో ద్వారా వెల్లడి…
ఫిల్మ్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆ సినిమా పేరు… వారణాశి! ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ globetrotter ఈవెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. తనను, మహేశ్ కి కల్పినందుకు నిర్మాత నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు. తన గత సినిమాలు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేవారమని అన్నారు.
ఈ సారి ఒక వీడియోతో ప్రేక్షకులు గెస్ చేసుకునే విధంగా సరి కొత్తగా ఈ ఈవెంట్ రూపొందించామన్నారు . సినీ హీరో కృష్ణ ను చూసి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీయ్యడం అలవాటు చేసుకున్నాను అని చెప్పారు. కృష్ణ కుమారుడు మహేశ్ తో సినిమా తీసే అవకాశం దొరికిందన్నారు.
