ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి

ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు వెంగళ్ రావు నగర్(Vengal Rao Nagar)లో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో కలిసి రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ప్రచార ర్యాలీలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌(Naveen Yadav)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) కళాకారులతో కలిసి డబ్బు కొట్టి కళాకారులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. రహదారి వెంబడి కొద్దిసేపు మంత్రి వాకిటి శ్రీహరి డప్పు కొట్టడం దారి వెంబడి ఉన్న ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది.

Leave a Reply