IPL 2025 | మెగా టోర్నీ షురూ.. టాస్ గెలిచిన ఆర్సీబీ !

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో, ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ క్యాష్-రిచ్ లీగ్ ప్రారంభమవుతుంది.

ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ – ఆర్సీబీ జట్లు నయా సారథులతో బరిలోకి దిగడం విశేషం. వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే కెప్టెన్సీలో నాలుగో టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా కేకేఆర్… యువ ప్లేయర్ రజత్ పాటిదార్ నాయకత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆర్‌సీబీ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీద‌ర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేకేఆర్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

తుది జ‌ట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్.

కోల్‌కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్.

ఐపీఎల్ 2025 లో అరంగేట్రం చేస్తున్న ఆటగాళ్లు

కేకేఆర్ నుంచి స్పెన్సర్ జాన్సన్ త‌న తొలి మ్యాచ్ ఆడ‌నున్నాడు.
కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్ ఆర్‌సిబి త‌రుఫును అరంగేట్రం చేస్తున్నారు.

ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే

కోల్‌కతా నైట్ రైడర్స్ : లువ్నిత్ సిసోడియా, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్ట్జే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, స్వప్నిల్ సింగ్, మనోజ్ ఎస్ భాండాగే, రొమారియో షెపర్డ్, అభినందన్ సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *