మన వస్తువు మీద మనకు ఉన్న సంబంధాన్ని వదులుకుని ఎదుటి వారికి సంబంధాన్ని కలిగించడం దానం, దానం అనేది ఇచ్చేవారి లాభం కోసం చేసిది. చేసిన పాపాలను తొలగించుకోవడానికి సదాచార సంపన్నుడైన బ్రా#హ్మణుడిని పిలిచి ఆయా వస్తువులను దానం చేస్తారు. దానం తీసుకున్న వారికి ఇచ్చిన వారి పాపం సంక్రమిస్తుంది. కావున దానంఇచ్చేవారు ఫలానా పాప పరిహారం కోసం దాన్ని ఇస్తున్నామని చెప్పి తీసుకునే వారి ఆమోదాన్ని పొంది దానం చేయాలి. దానం చేసిని వారి పాపాన్ని తీసుకుని తొలగించుకోగల శక్తి ఉన్నవారు మాత్రమే దాన్ని తీసుకోవాలి. దానాన్ని వ్యాపార దృష్టితో చూడరాదు. దానాన్ని కావాల్సినంతా దక్షిణ అడిగ తీసుకునే వారు యోగ్యులు కారు, అడిగినంత ఇచ్చేవారు దాతలు కారు.
దాన ధర్మాలలోని అంతరార్ధం
