అమ్మవారి చరిత్ర విశిష్టమైనది..

అమ్మవారి చరిత్ర విశిష్టమైనది..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగుతున్న తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర ఎంతో విశిష్టమైనదని ఎంర్ పిస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ అన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి బుధవారం ఆయన స్థానికులతో కలిసి తొలి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్ బాబు, ఏఈకు జంగం శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రంతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగిల ప్రతినిధిగా అమ్మవారికి తొలిబోనం తేవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్రస్వామికి సిద్దయ్య ఎలాంటి అనుబంధం ఉందో పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మకు, అమ్మవారి ఆలయంలో మాదిగ చింతయ్య విగ్రహం ఉండటంతో అలాంటి అనుబంధమే ఉందన్నారు. కావున ఆలయ ప్రాంగణంలో చింతయ్య విగ్రహానికి కూడా ఆలయం నిర్మించాలని ఆలయ అధికారులను పాలకవర్గాన్ని కోరుతున్నా మన్నారు.

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ఇష్టదైవంగా అమ్మవారు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యకులు మార్కపూడి గాంధీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, బోనాల కమిటీ సభ్యులు ముండ్లపాటి ప్రసాదరావు, కోట రాజా, పొద్దుటూరి రాజశేఖర్, ముండ్లపాటి లక్కణ్, ముండ్లపాటి రాము పరగటి మధుమురళి, కత్తులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply