ఆ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్

ఆ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరికి పైగా పిల్లలు ఉండకూడదన్న నిబంధన ఎత్తివేతకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఆమోదం తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేయడంతో, అది చట్టబద్ధత సాధించింది. న్యాయశాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో ఇద్దరికి పైగా పిల్లలున్న నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పొందనున్నారు.

Leave a Reply