దండేపల్లి, సెప్టెంబర్ 2(ఆంధ్రప్రభ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకుఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project), కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు (Kadem Narayana Reddy Project) లు పూర్తిగా నిడడంతో, అధికారులు దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో గోదావరి ప్రవాహం ఎక్కువ కావడంతో దండేపల్లి మండలంలోని గుడిరేవు, లక్ష్మీ కాంతపూర్ గ్రామాలలో వరి పొలాలు, పత్తిచేలు పూర్తిగా నీటమునగడంతో మంగళవారం మంచిర్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోని, ఎకరానికి 40,వేల నష్టపరిహారం అందించాలని ప్రభుతాన్ని కోరారు. అనంతరం నెల్కి వెంకటాపూర్ (Nelki Venkatapur) సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా (Urea) కొరత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో 10సంవత్సరాలు రైతులకు యూరియా తిప్పలు లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కలిసి రైతును మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ది చెప్పుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, సహకార సంఘం వైస్ చైర్మన్ అక్కల రవీందర్, నాయకులు రేణి శ్రీనివాస్, బొమ్మేన మహేష్, గుర్రాల నరేష్ ,రమణ, గోళ్ల రాజమల్లు, రమేష్, రుపేందర్, బచ్చల అంజన్న, చిట్ల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply