నూతన ఒరవడికి శ్రీకారం..

శావల్యాపురం, (ఆంధ్రప్రభ) : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan MohanReddy) ఆదేశాలతో గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు, అందులో భాగంగా గ్రామాల్లో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచనల మేరకు మండలంలోని వయ్యకల్లు గ్రామంలో వైసీపీ గ్రామకమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులుగా కావూరి మాబు సుబానయ్య, దారా లింగారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కన్వీనర్ కొండలు మాట్లాడుతూ.. నూతన కమిటీ సభ్యులు (New committee members) గ్రామాల్లో కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం సీనియర్ నాయకుడు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావూరి మాబు సుభానయ్య మాట్లాడుతూ.. గ్రామంలో, మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నా పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బొల్లా సుబ్బారావు, వైసీపి నాయకులు దారా మోషే, బోడేపూడి శ్రీనివాసరావు, సైదయ్య, ఆళ్ల రాముడు, కొర్రపాటి బుల్లోడు, వీరేంద్ర, ప్రసన్న, నరేష్ మండల అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply