కొనసాగిన కూల్చివేతలు..

  • తండ్రీ కొడుకుల ఆత్మహత్యా యత్నం..

బెల్లంపల్లి (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ చేపట్టిన రోడ్డు విస్థరణ పనుల్లో బాగంగా రెండవ రోజు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నకోళ్ల దుకాణలు, పండ్ల దుకాణలు, టేలాలు, జే సీ బీ లతో కూల్చి వేశారు. ఎండీ గౌస్, అతని కొడుకు ఇమ్రాన్ లు తమ దుకాణాలు కూల్చవద్దని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వెంటనే గమనించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బెల్లంపల్లి ఏ ఆర్ పోలిస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రత్యేక పోలీసులు భారీ పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. కాగా రోడ్డు విస్తరణ కూల్చివేతలను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు.

ధర్నా చేపట్టిన చిరు వ్యాపారస్తులు..

తమ దుకాణాలు కూల్చవద్దని కొందరు చిరు వ్యాపారులు ప్రధాన రహదారి పై రాస్తారోకో చేశారు. తమకు న్యాయం చేయాలనీ, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చ జెప్పారు. మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వ్యాపారస్తులు కూల్చివేతలు ఆపాలంటూ పెట్రోల్ పోసుకొని తండ్రి,కొడుకులు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ.. తాము గత 30 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం షాపులు, షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. కూల్చివేతలు ఆపాలంటూ తాము హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని అధికారులను చిరు వ్యాపారులు వేడుకున్నారు.

ఎట్టకేలకు ప్రభుత్వ స్థలంలో…

పట్టణంలో చాలా కాలంగా ఎస్సీ కమ్యూనిటీ హాలు ప్రక్కన ప్రధాన సల్లేజి డ్రైన్ ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొందరు వ్యక్తులు కట్టిన ఆక్రమణలను కూడా జేసీబీలతో మున్సిపల్ సిబ్బంది కూల్చి వేశారు. ప్రధాన కాలువ ప్రక్కన ఉన్న ఆక్రమణలను హైద్రా నిబంధనల ప్రకారం కూల్చి వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply