ప్రతిబింబించిన సంస్కృతి..
(నర్సంపేట, ఆంధ్రప్రభ): నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నోస్కూల్(Balaji Technoschool)లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్(Technoschool, Educational Institutions) డాక్టర్ ఎ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ ఎ. వనజ, ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. డాక్టర్ ఎ. వనజ(Dr. A. Vanaja Feedbac)విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి , సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమి తల్లిని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి(Gummadi, Thangedu, Gunugu, Banti, Chamanti) పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగే బతుకమ్మ పండుగ అన్నారు.
ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు పూలతో అందంగా అలంకరించి బతకమ్మ ను పేర్చి ఆటపాటలతో ఆడుకుంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) నాడు పూలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి ప్రతీక గా నిలిచిందని, స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాస భారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల(Students) తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.