సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది

సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది

  • మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు

జైనూర్, ఆంధ్రప్రభ ; నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాత్ రావు అన్నారు. శుక్రవారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉష గంలో చైర్మన్ తో పాటు అధికారులు నాయకులు శుక్రవారం నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూనిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

అర్హులైన నిరుపేద లకు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు. నూతన ఇందిరమ్మ ఇండ్ల ఇంటి యజమానులు సీతా బాయి వామన్ దంపతులకు కానుకలు అందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు కూడు,గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యం తో కాంగ్రెస్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసి సద్వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ బిర్షావ్, ఎంపిడిఓ సుధాకర్ రెడ్డి, లింగాపూర్ ఎంపిడిఓ రామచందర్, ఎంపీ ఓ శశి కుమార్, సర్పంచ్ ఆత్రం నిర్మల శేసిపాల్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్ , నాయకులు మెస్రం అంబాజీ రావు, ఆత్రం జాలింషా, మెస్రం భూపతి , పంచాయితీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply