
లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : తుదివిడత గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా చేపట్టాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. బుధవారం రాత్రి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను,అదనపు ఎస్పీ ఎండి రియాజ్, డీఎస్పీ మహేష్ లతో పోలీసు అధికారులతో ఎస్పీ మాట్లాడి, కౌంటింగ్ ప్రక్రియ అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, కౌంటింగ్ పూర్తయి పోలింగ్ బాక్స్ లు ఈ పోలింగ్ బాక్స్లు ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లే వరకు అప్రమత్తంగాఉండాలని ఆదేశించారు. రాత్రివేళ ఎన్నికల కౌటింగ్ పగడ్బందీగా చేపట్టే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ మూసే వరకు అధికారులందరూ సమిష్టిగా విధులునిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.
