వార్డులోని సమస్యలను కమిషనర్ కు వివరించిన కౌన్సిలర్..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ కు కౌన్సిలర్ వివరించారు. శనివారం రోజు పరకాల పురపాలక సంఘం 19వ వార్డులో నూతన కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సోమిడి అంజయ్య వార్డులోని కాలనీలు తిరుగుతూ పారిశుద్ధ్యం, నూతన డ్రైనేజీల నిర్మాణం, నూతన సీసీ రోడ్ల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు, వార్డులోని ప్రజలకు మంచినీటి సౌకర్యం అందే విధంగా పనులు వార్డు సమస్యలను కమిషనర్ కు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ వివరించారు. వార్డులోని సమస్యలు, అభివృద్ధి పనులను సత్వరంగా అయ్యేటట్లు కృషి చేస్తానని కమిషనర్ అంజయ్య కౌన్సిలర్ శ్రీనివాస్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు యువత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
