NZB | సన్నబియ్యంలో అధిక వాటా కేంద్రానిదే… ఎమ్మెల్యే ధ‌న్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 3 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న రేషన్ సన్నబియ్యంలో అధిక వాటా కేంద్రానిదేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని నాందేవాడ మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద గల 21వ రేషన్ షాప్ లో నిర్వహించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం, గోధుమలు సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 96లక్షల రేషన్ కార్డు లబ్దిదా రులకు ఒక్కరికి 5కేజీల బియ్యం ఉచితంగా కేంద్రమే ఇస్తుందన్నారు. హమాలీ, గోడౌన్, సెస్ అన్ని ఖర్చులు కలుపుకుంటే ఒక కేజీ బియ్యం పైన సుమారు రూ.38లు కేంద్రమే భరిస్తుందన్నారు.

అలాగే ప్రతి రేషన్ షాప్ లో కూడా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో దాదాపు 30లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో అర్హులైన వారందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్స్ కు గౌరవ వేతనం, కమిషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ నెం.21 (నార్త్ ) డీలర్ దివ్య నామ్ దేవ్ వాడ, డివిజన్ నెం. 36. మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, ఏఎస్ఓరవి రాథోడ్, సౌత్ ఎమ్మార్వో బాల్ రాజ్, మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *