కాకినాడలో ప్రేమికుడి దారుణ హత్య
- స్నేహితుడే హంతకుడు
హైదరాబాద్, ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా చీడిగాలో ఈ రోజు ఉదయం దారుణ హత్య స్థానికుల్లో కలకలం రేపింది. గంటా శ్యామ్యూల్ రాజ్(Ganta Samuel Raj) అనే యువకుడిని అతని స్నేహితుడు హత్య చేశాడు. ఇద్దరి మధ్య ప్రేమ విషయంలో ఏర్పడిన తీవ్ర ఘర్షణతో ఈ హత్య జరిగింది.
ఈ ఘటన ప్రేమ, స్నేహం(Love, Friendship) మధ్య పోటీలో రగిలిన మానసిక స్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. శ్యామ్యూల్ రాజ్ అతడి స్నేహితుడు ఒకే యువతిని ప్రేమించారు. ఇద్దరి మధ్య విరోధం ఏర్పడింది. ఈ ఘటన శనివారం ఉదయం సుమారు 8 గంటలకు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

