అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.?

అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.?
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక కార్యాచరణతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కిలేశపురం గ్రామంలో రూ.4.2 కోట్ల హడ్కో నిధులతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. కిలేశపురం గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుచూపుతో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. దీనివల్ల లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్ సమస్య తీరిపోనున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలనే ప్రధాన లక్ష్యంతో విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణాలకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రానున్న వేసవి దృష్ట్యా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
