అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్..

అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 24న జరిగిన తనిఖీల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిగా కాల్వశ్రీరాంపూర్ ఏఓ నాగార్జునకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply