ఆ.. అవకాశం రైతులు కోసం..

ఆ.. అవకాశం రైతులు కోసం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీ ద్వారా అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. చౌటుప్పల్ మండలoలో 2 గడ్డి కట్టే యంత్రాలు (స్ట్రా బేలర్) (1 జనరల్ కేటగిరీ, 1 ఎస్సీ కేటగిరి), 5 రోటవేటర్లు (3 జనరల్ కేటగిరీ, 2 ఎస్సీ కేటగిరీ) అందుబాటులో ఉన్నాయని, అర్హత గల రైతులు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఈ నెల 5వ తేది గురువారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏవో నాగరాజు తెలిపారు.

అదే విధంగా చౌటుప్పల్ డివిజన్ లోని నారాయణపురం మండలంలో వ్యవసాయ యాంత్రికరణ పథకం 2025-26 సంవత్సరo కింద మండలంలోని రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలను అందించడం జరుగుతుందని, మండలంకు రోటోవేటర్స్ జనరల్-3, ఎస్టీ -3 అందుబాటులో ఉన్నాయని ఏవో బి పూజ తెలిపారు. పెద్ద రైతులకు 40 శాతం, చిన్న, సన్నకారు, ఎస్సీ , ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ పై అందజేయడం జరుగుతుందని, ఆసక్తి గల రైతులు దరఖాస్తుతో పాటు భూమి పట్టా పాస్ బుక్ జీరాక్స్, ఆధార్ జిరాక్స్, ఆర్సీ జిరాక్స్, పాస్ పార్ట్ ఫోటో జత చేసి ఈ నెల 5వ తేదీ వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఏవో పూజ కోరారు.

Leave a Reply