కలెక్టర్‌కి కృతజ్ఞతలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను విన్నవించుకోవటానికి కలెక్టర్ కార్యాలయం వద్దకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వందల మంది హాజరు కావడం విశేషం. వాళ్ల సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియని పరిస్థితి.
ఉదయాన్నే అర్జీలు పట్టుకుని కలెక్టర్ కార్యాలయం(Collector’s Office) వద్దకు వచ్చిన వారికి మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందజేయడం విశేషం. ఉదయం 6 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన వీరు ఆకలితో అల్లాడకుండా ఉచిత భోజన వసతి సౌకర్యాలను ఓంకార క్షేత్రం కాశీనాయన అన్నసత్రం వారి సహకారంతో రెడ్ క్రాస్(Red Cross) ఆధ్వర్యంలో ఉచితంగా అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన పీజీఆర్ఎస్(PGRS) అర్జీదారులకు ఓంకార క్షేత్రం కాశినయన అన్న సత్రం వారి సహకారంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది అర్జీదారులకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారమైతేయో తెలియదు కానీ ఆకలితో వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టి పంపించిన కలెక్టర్ కి అర్జీదారులు(Petitioners) కృతజ్ఞతలు తెలుపటం విశేషం.


