ఆదిలాబాద్ డిపో, బస్ స్టేషన్ ను టిజిఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోమవారం తనిఖీ చేశారు. డిపో పరిధిలోని తిరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లతో పాటు గ్యారేజీ సిబ్బందితో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనితీరును ఆరా తీశారు.
అలాగే బస్టాండ్ లోని ప్రయాణికిలతోనూ ఆయన మచ్చటించారు.. ఉచిత బస్సు పథకంపై మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.. అనంతరం బస్ స్టేషన్ లో ఆర్టీసీ అందిస్తోన్న సేవలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ తో కూడిన కీ చైన్ లను ప్రయాణికులకు అందజేశారు.
