హైదరాబాద్ , ఆంధ్ర్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు-2 ఫలితాలు (Group-2 Results) విడుదలయ్యాయి. ఈ రోజు టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే, ఒక్క పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో పెట్టింది.
ఇక 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దశల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు.
సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేశారు. తుది ప్రక్రియ ముగియడంతో.. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేశారు. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.tspsc.gov.in/