ఆశ్రమ హైస్కూల్ ను తనిఖీ చేసిన హెచ్ఆర్ కమిషన్ చైర్ పర్సన్ ..

ఆశ్రమ హైస్కూల్ ను తనిఖీ చేసిన హెచ్ఆర్ కమిషన్ చైర్ పర్సన్ ..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ హైస్కూల్ ను,ప్రభుత్వాసుపత్రిని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి విద్య సామర్ధ్యాన్ని పరిశీలించారు.ఆ విద్యార్థుల స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేసి, ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, మంచిర్యాల డీడీఓ రమాదేవి,ఏటీడీఓ సురేష్, స్థానిక ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్,గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం లక్ష్మీరాజం,ప్రభుత్వ వైద్యాధికారులు ఉమాశ్రీ, లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.

