TG | చైన్ స్నాచింగ్..

TG | చైన్ స్నాచింగ్..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళపై దుండగులు దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బంజేరు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా, గుర్తుతెలియని దుండగులు అక్కడికి వచ్చారు.

ఈ క్రమంలో ఆమె కళ్లలో కారం కొట్టి, మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు భయాందోళనకు గురయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply