బాసర, (ఆంధ్ర ప్రభ) : బాసరలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు వచ్చి నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారని బాసర ఎస్ఐపి శ్రీనివాస్ తెలిపారు.
మహారాష్ట్రలోని పర్భాని జిల్లా టాక్లీ గ్రామానికి చెందిన బాలుడు కుల్దీప్ బాలాసాహెబ్ (11), నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బోళ్ల మల్ల రాజు (40) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందారు.
స్నాన ఘాట్ వద్ద అమ్మవారి దర్శినానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు… అక్కడ ఉన్నవారి మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు.