TG TET | టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

TG TET | టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TG TET) 2026 నోటిఫికేషన్‌ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

అభ్యర్థులు తమ అర్హతలను నిర్ధారించుకుని, పరీక్షకు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఈ నెల 29వ తేదీగా నిర్ణయించారు. పరీక్షలను 2026 జనవరి 3 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్‌ (Computer Based Test – CBT) విధానంలో జరగనున్నాయి. ప్రతి అభ్యర్థికి కంప్యూటర్‌పై ప్రశ్నల సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ, సమయం, సెంటర్‌ వివరాలను తరువాత అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు.

అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఫీజు వివరాలు, సిలబస్‌ మరియు పరీక్ష నమూనా వంటి పూర్తి సమాచారం కోసం తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Pune Accident | పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం….

Leave a Reply