TG|ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ – ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఫ్యూచర్‌ సిటీ బోర్డుకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటిలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు.

కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది..

క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు

మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీలలో విలీన చేయాలని నిర్ణయించారు.. దీంతో పట్టణ జిల్లాగా మేడ్చల్ మారుతుంది. సెర్ఫ్, మెప్మా విలీనంకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ములుగుతో పాటు మరికొన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో.. గ్రామ పంచాయతీల జాబితా నుంచి ఆ గ్రామాలను తొలగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది

తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రులు

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

ఫ్యూచర్‌ సిటీ బోర్డుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం

ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు చేయాలని నిర్ణయం

10,950 విలేజ్‌ లెవెల్‌ ఆఫీసర్స్‌ పోస్టుల మంజూరుకు ఆమోదం

కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం

10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌

మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమార్చి 12 నుంచి 27 వరకూ కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *