TG | నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం..

ఐదు గ్రామాలలో రీ-సర్వే..

తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తరతరాలుగా నిజాం కాలం నుండి సర్వే చేయని, ఎటువంటి సర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఆ 413 గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహించి దానిలో వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని తెలిపారు.

పైలెట్‌ గ్రామాలు…

మహబూబ్‌నగర్‌ జిల్లా.. గండీడ్‌ మండలం సలార్‌నగర్‌ , జగిత్యాల్‌ జిల్లా భీర్పూర్‌ మండలం కొమ్మనాపల్లి (కొత్తది) గ్రామం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్‌ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ రెండు పద్దతులలో విస్తృత సర్వే జరుగుతుందని, ఏరియల్‌, డ్రోన్‌ సర్వే పద్దతి, ప్యూర్‌ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పద్దతుల్లో సర్వే చేసి జియో రిఫరెన్డ్స్‌, క్యాడస్ట్రల్‌ మ్యాపులు, హక్కుల నమోదు పత్రాలను తయారుచేస్తారని తెలిపారు.

ఈ నూతన విధానాలతో భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుంది, ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

Leave a Reply