వనపర్తి ప్రతినిధి, మార్చి 02(ఆంధ్ర ప్రభ):పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సీఎం. రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ లో వనపర్తికి చేరుకున్నారు.ఈసందర్బంగా మంత్రి. జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు. చిన్నా రెడ్డి, ఎమ్మెల్యే. మేఘా రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తను అద్దెకు ఉంటూ చదువుకున్న పార్వతమ్మ ఇంటికి చేరుకొని ఆప్యాయంగా పలకరించారు.సీఎం హోదాలో మొదటి సారి రేవంత్ రెడ్డి వనపర్తికి రావడంతో ఆయన అభిమానులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు._