TG | సిటీ బ‌స్సెక్కిన మంత్రి పొన్నం…

మ‌హిళా ప్ర‌యాణీకుల‌తో మాటామంతి
స‌మ‌స్య‌లనే ఏక‌ర‌వుపెట్టిన ప్ర‌యాణీకులు
డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ తో కూడా మాట‌లు
త్వ‌రలోనే అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కస్తాన‌ని హామీ

హైదరాబాద్ సిటీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డీకపూల్‌లో హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టారు. మహిళా ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న మంత్రి త్వ‌ర‌లోనే వాటిని ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

Leave a Reply