TG | నస్పూర్ ఎస్ఐకి పోలీస్ రియల్ హీరో అవార్డ్ !

నస్పూర్, ఆంధ్రప్రభ : హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై ఉపేందర్ కు తెలంగాణ పోలీస్ రియల్ హీరో అవార్డును అందజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి నేరస్థుడిని పట్టుకోవడంలో ఆయన చేసిన సేవలకు గాను మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు ఎస్‌ఐ ఉపేందర్‌కు ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు.

ఉపేందర్ టాస్క్ ఫోర్స్ లో ఎస్ ఐగా పనిచేస్తున్న సమయంలో… గంజాయి కేసులో నిందితుడు ఎస్ ఆర్ ఎస్ పి కాలువలోకి దూకి పారిపోయాడు. అయితే, ఎస్ఐ ఉపేందర్ తన ప్రాణాలను పణంగా పెట్టి కాలువలోకి దూకి నిందితుడిని పట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఉపేందర్ ధైర్యసాహసాలకు గాను పోలీస్ రియల్ హీరో అవార్డు లభించింది.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన ఎస్ఐని డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి పోలీసు అధికారుల వల్లే తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Leave a Reply