హైదరాబాద్ . ఆంధ్రప్రభ – వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీ హిల్స్ లోని సిఎం నివాసానికి వెళ్లిన శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి బోకే ఇచ్చారు.. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డిని దుశ్శాలువతో రేవంత్ సత్కరించి అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ తెలిపారు.
TG | రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వక భేటి
