హైదరాబాద్ – ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeswara reddy) కాలు జారీ పడడంతో అస్వస్థకు గురయ్యారు. స్థానిక సిబ్బంది ఫామ్హౌస్ నుంచి అంబులెన్స్ లో హైదరాబాద్ (Hyderabad) కు తరలించారు. కాగా, కెసిఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ ( kalesewram ) ఎదుట హాజరకానున్న సందర్భంగా పల్లా నేటి ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు.. ఈ సమయంలో కెసిఆర్ ఇంటిలోనే ఆయన ఫ్లోర్ పై జారీ పడ్డారు. వెంటనే సిబ్బంది అంబులెన్స్ ను పిలిపించి చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.. కాగా, కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం కెసిఆర్ నేరుగా పల్లా చికిత్స పొందుతున్న యశోదా హాస్పిటల్ కు వెళ్లారు.. ఆయనను పరామర్శించారు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకుని రావాలని ఆకాంక్షించారు. అలాగే చికిత్స అందిస్తున్న వైద్యులను పల్లా ఆరోగ్యం గురించి వివరాలు అడిగారు.. తుంటి ఎముక చిట్లిందని, చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పారు.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పల్లాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
