తమ లేఖలపై దర్శనం కల్పించాలని డిమాండ్
ఏప్రిల్ లోగా నిర్ణయం తీసుకోవాలి
లేకుంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులతో వస్తాం
టిటిడి కార్యాలయం వద్దే తేల్చుకుంటాం..
తిరుమల – టీటీడీ అధికారుల తీరు పై బీజేపీ ఎంపీ సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతిని ధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటం పైన మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం సూచించినా.. టీటీడీ బోర్డు నిర్ణయించినా ఎందుకు పరిగణ లోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తిరుమలలో నేడు ఆయన శ్రీవారిని దర్శంచుకున్నారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిఫార్స్ లేఖలపై త్వరగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. వేసవి సెలవులలో తామ భక్తులకు ఇచ్చే లేఖలపై దర్శనం కలిగించాలన్నారు.. ఏప్రిల్ లోగా పరిస్థితిలో మార్పు రాకుంటే తెలంగాణ ప్రతినిధులందరితో టిటిడి కార్యాలయానికి వచ్చి అక్కడే తేల్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు..
పట్టించుకోవటం లేదు
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోవటం లేదని ఆ రాష్ట్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖ లను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి టీటీడీకి సూచించారు. ఈ మేరకు నిబంధనలు సైతం ఖరారు చేసారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు తిరుమలలో దర్శనం.. వసతి కోసం ప్రజా ప్రతినిధులు లేఖలు ఇస్తున్నారు. అయినా.. పట్టించుకోవటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు.
నిర్ణయం జరిగినా
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల ఆమోదం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా అమలు చేస్తే.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు రోజుకు 1100 టికెట్లు అదనంగా పెరుగుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రోజుకు 7500 దర్శనాలు వీఐపీలకు ఇస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల లేఖలకు 2 వేల వీఐపీబేక్ దర్శనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రోజూ 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుం టున్నారు. కాబట్టి సహజంగా టీటీడీపై ఒత్తిడి అధికంగా ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు. అయితే, తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిభ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకొనేలా తొలుత నిర్ణయం జరిగింది. అయితే.. అమలు మాత్రం జరగటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.