సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా కేటీఆర్ వడ్డించారు. మాలాదారులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు చిత్రపటం అందించారు.
