హైదరాబాద్: బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ..మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ (Twitter) వేదికగా..’కేసీఆర్ (KCR) గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గద. ఆయన ఎప్పటికీ తెలంగాణ (Telangana) కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!.బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు!. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!’ అని వ్యాఖ్యలు చేశారు.
TG | బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావు – రేవంత్ కు కెటిఆర్ ట్విట్
