TG | హ‌స్తం పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప బై బై …

సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ – కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నేడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిసి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలిపారు. కాగా, బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు.

కి మద్దతు ప్రకటించారు.

.కాగా… సిర్పూర్-కాగజ్‌నగర్‌ కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరాయి. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడటం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్‌ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు.. మీకు అంత సీన్ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని కూడా తేల్చిచెప్పారు. గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయం కూడా గుర్తు చేశారు. సీఎంను కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్‌ పూర్తి చేయాలని చెప్పినా.. స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న హ‌స్తం పార్టీ అభ్య‌ర్ధికి కాకుండా స్వతంత్రంగా బరిలోకి దిగిన బిసి అభ్యర్ధి హరికృష్ణకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *