TG|ఉప ఎన్నికలు ఖాయం – బీఆర్ఎస్ విజయం తధ్యం: కెసిఆర్
హైదరాబాద్ – త్వరలోనే తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఓడిపోవడం ఖాయమి జోస్యం చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య నేడు ఎర్రవల్లి లో కేసీఆర్ ను కలిశారు కలిశారు. ఈసందర్భంగా కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు . మోసం చేసిన వాళ్లను తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారని..స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరిని ఓడించి మళ్లీ రాజయ్యను గెలిపిస్తారని చెప్పారు.