TG | వనపర్తిలో ఐటీ టవర్లు.. ఉత్తర్వులు జారీ !
వనపర్తి జిల్లాకు ఐటీ టవర్‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తిలో బఫెట్ టవర్ మంజూరు చేస్తూ.. రూ.22 కోట్లు విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఐటీ టవర్‌ను జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగవరంలో రెండెకరాల స్థలంలో నిర్మించనున్నట్లు చిన్నారెడ్డి వెల్లడించారు. ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి తెలిపారు.