సీఎంని కలిసిన టీజీ సమాచార బృందం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్‌టీఐ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ(RTI) వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసింది.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు. ఆర్టీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే నలుగురు కమిషనర్లను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.