TG | వివాహ హామీలపై హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు !

తెలంగాణ హైకోర్టు వివాహ హామీలపై ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, తరువాత ఆ హామీని నెరవేర్చకపోవడాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటాన‌ని హామీ ఇవ్వడం, ఆ తరువాత ఆ హామీని నెరవేర్చకపోవడం మోసం కావచ్చు కానీ… అది నేరంగా పరిగణించదగిన మోసం (క్రిమినల్ చెటింగ్) కిందకు రాదు అని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్‌కు చెందిన కర్మన్‌ఘాట్ నివాసి రాజాపురం జీవన్ రెడ్డిపై (కరకల్ల పద్మినీరెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేయగా) 2019లో మోసం కేసు నమోదైంది. జీవన్ రెడ్డి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పాడనే ఆరోపణపై కేసు నమోదైంది.

హైకోర్టు తుది తీర్పు:

అయితే, ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్. తుకారాంజీ, పెళ్లి చేసుకుంటాన‌ని హామీ ఇవ్వడం, ఆ తరువాత ఆ హామీని నెరవేర్చకపోవడం మోసం కావచ్చు కానీ… అది నేరంగా పరిగణించదగిన మోసం (క్రిమినల్ చెటింగ్) కిందకు రాదు అని తెలిపింది. ఆ హామీ ఇచ్చే సమయంలోనే ఆ వ్యక్తికి మోసం చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లైతే మాత్రమే – క్రిమినల్ కేసు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ కేసులో అలాంటి ఆధారాలు లేనందున, ఫిర్యాదు మోసం కేసుగా పరిగణించదగదని తీర్పు ఇచ్చి కేసును కొట్టివేసింది.

Leave a Reply