TG | క్యాబినేట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – జ‌స్టీస్ పి సి ఘోష్ కు డాక్యుమెంట్లు అంద‌జేసిన హరీశ్ రావు


బేసిక్స్ తెలియ‌ని ఉత్త‌మ్, బేసిన్స్ తెలియని రేవంత్
ప్రాజెక్ట్ ల‌పై రేవంత్, ఉత్త‌మ్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే
నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల‌ని కోరిందే కెసిఆర్
మీ కాంగ్రెస్ హాయాంలోనే కృష్ణా నీటి వాట‌లో కోత‌

హైద‌రాబాద్ – కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleswaram project ) పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయని స్ప‌ష్టం చేశారు నీటిపారుద‌ల శాఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్య హ‌రీశ్ రావు (Harish rao ) .. మేడిగడ్డ (medigadda ) పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింద‌ని,. అలాగే శాసనసభలో (assembly ) కూడా మూడుసార్లు ఆమోదం పొందింద‌ని చెప్పారు..

ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమిషన్‌కు అందజేశాం. కానీ, కమిషన్‌కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను మాకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగాను అని తెలిపారు. అలాగే, నేను సీఎస్, జీఎడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాసాను. కానీ ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదు. అసలు కమిషన్‌కు నిజమైన వివరాలు ఇస్తున్నారా..? లేదా..? అనే అనుమానం వస్తోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ (chirman PC ghosh ) తో నేడు హరీశ్ సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి వివిధ డాక్యుమెంట్ల‌ను ఘోష్ కు అంద‌జేశారు..

సెక్షన్ 3 సాధించింది కేసీఆర్..
అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా బేసిన్‌ లోని 299 టీఎంసీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కేవలం 42 రోజుల్లోనే కేసీఆర్ కేంద్రాన్ని నీటి పంపిణీ కోసం అడిగార‌న్నారు. 299 ఇచ్చి అన్యాయం చేసార‌ని, 68శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ అడిగార‌న్నారు. సెక్షన్ 3 కోసం కేసీఆర్ అప్ప‌టి కేంద్ర మంత్రి ఉమా భారతి, కేంద్ర‌మంత్రులు నితిన్ గడ్కరి, షెకావత్ , ప్రధానిని కలిసార‌న్నారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ ఆ నిజాన్ని దాచి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ నీటి పంపకం ట్రిబ్యునల్ పరిధిలో ఉందని స్వయంగా ఓపెన్‌గా అన్నార‌ని, . బోర్డు తాత్కాలికంగా వాటాలను వెల్లడిస్తుందని ఆయన అంగీకరించార‌న్నారు. . ఇప్పుడు అదే విషయాన్ని తాము చెప్పగానే దానిని తప్పుగా భావిస్తున్నార‌ని. వాస్తవానికి సీఎం రేవంత్‌కు బేసిన్‌లు గురించి కనీస అవగాహన లేదు అంటూ హరీశ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వంటి చేతగాని నాయకుల వల్ల, పెదవులు మూసుకోవడం వల్ల 299 మనకు కేటాయించడం జరిగింద‌న్నారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టార‌ని, అది శాసన సభ రికార్డుల్లో కూడా ఉంద‌ని అన్నారు.. ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టిఎంసీలు కేటాయించిన విషయం చెప్పార‌న్నారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయం ఎందుకు దాచి పెడుతున్నార‌ని ప్ర‌శ్నించారు హరీశ్ రావు.

ట్రిబ్యునల్ సాధించింది కేసీఆరే
నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తంది, ఆ ట్రిబ్యునల్ సాధించింది కేసీఆరే అని హ‌రీశ్ చెప్పారు ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నద‌ని, . దానిపై దృష్టి పెట్టండి అని రేవంత్ కు సూచించారు హ‌రీశ్. ఇదే రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింద‌ని, . 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తమ్, రేవంత్ సంతకాలు పెట్టుకొని వచ్చార‌ని, మ‌రి 299 టీఎంసీలకు మీరెందుకు సంతకాలు పెట్టారు? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తుంటే, ఉత్తమ్ మొన్న 573 టీఎంసీలు చాలు అని అన్నార‌ని వివ‌రించారు. రేవంత్, ఉత్తమ్ మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం కోసం పని చేస్తున్నరా..? చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తున్నరా అంటూ రేవంత్ ను నిల‌దీశారు హ‌రీశ్. గోదావరి, కృష్ణాలో 1000, 500 టీఎంసీలు చాలు అనడం అజ్ఞానంతో మాట్లాడిన మాటలని ఫైర్ అయ్యారు… బాగా చదువుకొని, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకొండి అంటూ క్లాస్ పీకారు హ‌రీశ్ . బేసిన్ల గురించి తెల్వని ఆయన సీఎం , బేసిక్స్ తెల్వని ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారంటూ రేవంత్, ఉత్త‌మ్ ల‌కు చుర‌క‌లంటించారు..

Leave a Reply