రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఊరట కలిగించే అంశంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఓ ప్రధాన పథకం అమలుపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తెలంగాణలో మహిళలకు ఆర్థిక భరోసా అందించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త స్కీమ్‌పై దృష్టి పెట్టింది. ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగనున్న కేబినెట్ భేటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్ని శాఖల నుంచి అవసరమైన నివేదికలను సమీకరించేందుకు సీఎస్ కే.రామకృష్ణారావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇంకా BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానుంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…. కొత్త ఆర్థిక సహాయం పథకంతో ఎన్నికల్లో మరింత బలపడాలని భావిస్తున్నట్టు సమాచారం.
