కరీంనగర్ కల్చరల్ ఆంధ్రప్రభ రంగుల పండుగ హోలీ సంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శుక్రవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ హోలీ పండగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని పంచాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహల మధ్య హోలీ పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
TG | హోలీ సంబరాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్
