TG | వైఎస్ఆర్ పేరుతో అవార్డులు – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో అభ్యుద‌య రైతుల‌కు (YSR Awards) అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (deputy CM Bhatti ) తెలిపారు. అందులో భాగంగా వైఎస్ఆర్ (YSR ) పేరు మీద ఒక ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు చెప్పారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి జ‌యంతి (YSR Birth Anniversary ) సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం నాడు బంజారాహిల్స్ వ‌ద్ద కాంగ్రెస్ నేతలు విగ్ర‌హానికి పూల‌మాల‌లు (garlands ) వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు.

వ‌చ్చే వ‌ర్ధంతికి అవార్డులు
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే వ‌ర్ధంతి క‌ల్లా ఒక కార్యక్ర‌మాన్ని రూప‌క‌ల్ప‌న చేసి వ్య‌వ‌సాయ రంగంలో నిష్ణాతులైన వారిని, వ్య‌వ‌సాయంపై రీసెర్చ్ చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్య‌వసాయ రంగానికి దోహ‌ద‌ప‌డుతున్న వారిని గుర్తించి వైఎస్ఆర్ పేరు మీద అవార్డులు ఇవ్వాల‌ని ఆలోచ‌న చేస్తున్నామ‌ని చెప్పారు. వైఎస్ఆర్ ను నిత్యం స్మ‌రిస్తూ.. వారి ఆలోచ‌న‌ను ముందుకు తీసుకువెళ‌తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. వైఎస్‌ఆర్ అంటే మొద‌ట గుర్తుకువ‌చ్చేది వ్య‌వ‌సాయం.. ప్రాజెక్టులేన‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. రెండు జీవ‌న‌దుల్లో ప్ర‌వహిస్తున్న నీటిని ప్రాజెక్టులు క‌ట్టి నీటిని పంట పొలాల‌కు పారించిన ఆలోచ‌న వైఎస్ఆర్ ది అని కొనియాడారు. వైఎస్ఆర్ భౌతికంగా లేని లోటును ఎవ్వ‌రూ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ప్ర‌జ‌ల‌కు తీర్చ‌లేర‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అన్నారు.

కెటిఆర్ కు భట్టి కౌంటర్

సిఎం రేవంత్ సవాల్‌ను జీర్ణించుకోలేక అడ్డగోలుగా కెటిఆర్ మాట్లాడుతున్నార‌ని భ‌ట్టి విమ‌ర్శించారు. ఇక భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావ‌ని అన్నారు.. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామ‌ని, అసెంబ్లీలో చర్చకు కేసీఆర్‌ రావాల‌ని పిలుపు ఇచ్చారు. గోదావరి, కృష్ణ జలాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply