TG Assembly | బిఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ‌కు మ‌ర‌ణ శాస‌నం – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, హరీశ్‌రావులు తెలంగాణ మరణంశాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తీసుకుంటామన బీఆర్ఎస్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎస్ ఎల్ బి సి టన్నల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు. ఎపి సిఎం చంద్ర‌బాబు ముందు కెసిఆర్, హారీశ్ రావులు మొక‌రిల్లి కృష్ణాజ‌లాల‌ల‌ను ఎపికి అప్ప‌గించారంటూ మండిప‌డ్డారు..

కేసీఆర్‌కు క్షమాపణ చెబుతా..

కృష్ణా జలాల విషయంలో నేడు సభకు వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ మొహం చాటేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏ రోజైతే సభకు వస్తారో.. ఆ రోజు తాను కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆ చర్చలో తమ తప్పు ఏమైనా ఉందని నిరూపిస్తే.. నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెబుతానని అన్నారు. కృష్ణ నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం జరిగిందని ఆరోపించారు.

2022లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని పచభక్ష పరమాన్నాలు పెట్టారని అన్నారు. రాయలసీమలో ఇవాళ పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట ఇరిగేష్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకు 10 టీఎంసీ నీరు ఆంధ్రాకు అక్రమంగా వెళ్తోన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 60 రోజుల్లో 600 టీఎంసీల కృష్ణా జలాలు పోతే.. మనకు ఏం మిగుతాయని అన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57.84 లక్షల జీతం తీసుకున్నారని.. ఇప్పటి వరకు ఆయన కేవలం రెండు సార్లే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

వాస్త‌వాల‌పైనే ప్ర‌భుత్వం

అబద్ధాల ప్రాతిపదిక కాదు.. వాస్తవాల మీద తాము ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించ లేదని అన్నారు. మహిళా గవర్నర్‌గా తమిళిసౌ సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ సర్కార్ అవమానించి విషయం నిజం కాదా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భనన్ కార్యకర్త ప్రసంగంలా ఉందంటూ.. కొందరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని కామెంట్ చేశారు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తాము మేనిఫెస్టో ఇచ్చామని.. అందులో చెప్పినవే అమలు చేస్తూ వన్నామని అన్నారు.

మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలే గవర్నర్‌ ప్రసంగంలో ఉంటాయని.. తమ ప్రభుత్వం విధానాన్ని గవర్నర్ సభలో చెప్పారని పేర్కొన్నారు . అవగాహన లేనివాళ్లు పదేళ్లు మంత్రులుగా చేసినం అని చెప్పుకోవడానికి అనర్హులని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా రావడం పక్కా అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్ అన్నా.. మహిళలు అన్నా గౌరవం లేదని ఆరోపించారు. ప్రజా శ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో అప్పుల కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని అన్నారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని పేర్కొన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీమ భరోసా పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.

స‌న్న వ‌డ్ల‌కు రూ 500 బోన‌స్

సన్న వడ్లకు రూ.500 బోనస్సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇచ్చామని అన్నారు. గతంతో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే రైతులను వరి పండించాలని కోరామన అన్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనగోలు చేస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారని.. కానీ కాళేశ్వరంలో నీళ్లు లేకపోయినా.. రికార్డ్ స్థాయిలో ధాన్యం పడిందని అన్నారు. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

గోళీలు ఆడేందుకు ఢిల్లీ వెళ్ల‌డంలా …

30 సార్లు కాదు 300 సార్లు ఢిల్లీ వెళ‌తాన‌ని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డ్డి.. తానేమీ హ‌స్తిన‌కు గోళీలు ఆడేందుకు వెళ్ల‌డం లేద‌న్నారు. తెలంగాణ హ‌క్కుల కోసం, రావాల‌సిన నిధుల కోసం కేంద్రంతో మాట్లాడేందుకే వెళుతున్నాన‌ని పేర్కొన్నారు.. దేశ ప్ర‌ధానిని బ‌డే బాయ్ అంటే త‌ప్పేంట‌ని బిఆర్ఎస్ ను ప్ర‌శ్నించారు.. కేంద్రంతో ఎంత సఖ్య‌త‌గా ఉంటున్నా అక్క‌డి నుంచి ఎటువంటి అనుకూల స్పంద‌న రావ‌డం లేద‌న్నారు.. తెలంగాణ‌పై వివ‌క్ష‌త ఇప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని అన్నారు రేవంత్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *