తగ్గిన రాబడులు

నామమాత్రంగా కేంద్ర గ్రాంట్లు
పన్నులపైనే ఆధారం • ఆర్థిక లోటు
రూ.69 వేల కోట్లు • పది నెలల్లో వ్యయాలు రూ. 193 కోట్లు • అప్పులకు వడ్డీలు రూ.24 వేల కోట్లు చెల్లింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పది నెలల్లో రాష్ట్ర రాబడులు నిర్దేశిత లక్ష్యంలో వెనకబడ్డాయి. రానున్న రెండు నెలల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆశలు పెట్టుకున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం పదినెలల్లో రాష్ట్రానికి పన్ను ఆదాయం రూ. 1.26 వేల కోట్లకి పైగా సమకూరింది. బడ్జెట్ అంచనాలో ఇది 72 శాతంగా నమోదైంది. కాగా గడచిన పది నెలల్లో ఖజానాకు అన్ని రకాలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరగా రూ.1.93 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. వరుసగా రెవెన్యూ లోటు, ఆర్థికలోటు, ప్రాథమిక లోటు నమోదైంది. ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో రూ. 10,566 కోట్ల రెవెన్యూ లోటు, రూ.69,148 కోట్ల ఆర్థిక లోటునమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సర రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్లో రెవెన్యూ ఖర్చు రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం…
