TG | జాతీయ అండర్–17 హాకీ జట్టుకు ఖమ్మం చరణ్ …

TG | జాతీయ అండర్–17 హాకీ జట్టుకు ఖమ్మం చరణ్ …

TG | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన ఖమ్మం చరణ్ ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 29న జరగనున్న జాతీయ అండర్–17 హాకీ పోటీలకు ఎంపికయ్యాడు.కరీంనగర్ జిల్లా రుక్మపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న చరణ్ తన ప్రతిభతో జాతీయస్థాయిలో చోటు దక్కించుకోవడం విశేషం. జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చి గ్రామానికి, స్కూల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply