ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజ సంస్కరణల పట్ల చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు వనపర్తి రాకేష్,మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, శక్తి కేంద్రం ఇంఛార్జి చీర్ల వెంకటేశ్వర్లు, బూత్ అధ్యక్షులు వేముల హరీష్,నెల్కి నరేష్, స్వర్గం శంకరయ్య, కొల్లూరి రాకేష్,నటరత్న యూత్ అధ్యక్షుడు బొమ్మేన మహేష్, తదితరులు పాల్గొన్నారు.
