ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ అధ్యక్షుడు మహబూబ్ అలీ మాట్లాడుతూ, సమాజంలో అసమానతల నిర్మూలన కొరకై పోరాడారని పేర్కొన్నారు. విద్యతోనే జ్ఞానం పెరుగుతుందని ప్రతి ఒక్కరికీ చదువు అవసరమని గుర్తించిన ఆయన సావిత్రిబాయి పూలేతో కలిసి బడుగు, బలహీన వర్గాలకు విద్యానందించి సమాజంలో గొప్ప మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కాజా మీయ, ముస్తాక్, వెంకటేష్, ఉస్మాన్, శ్రీనివాస్ చారి, చందు, అక్బర్, మీడియా ఇన్‌చార్జ్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply